హౌతీల దాడులతో సౌదీ చమురు ఎగుమతుల్లో భారీ మార్పులు

7742చూసినవారు
హౌతీల దాడులతో సౌదీ చమురు ఎగుమతుల్లో భారీ మార్పులు
కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తుండటంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సౌదీ అరేబియా తన గల్ఫ్ పోర్టు రాస్ తనూరా నుంచి సుమారు 6 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను ఒమాన్‌లోని సోహార్ పోర్టు మీదుగా మళ్లిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది. యన్బు చమురు ఎగుమతి టెర్మినల్‌లో అంతరాయాలు, పైప్‌లైన్‌పై దాడి నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దాంతో వచ్చే నెల తమకు సౌదీ క్రూడ్ సరఫరా ఉండదని కనీసం ఇద్దరు యూరోపియన్ రిఫైనరీ కస్టమర్లకు Saudi Aramco సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్