లాభాలతో 2025కి వీడ్కోలు

73చూసినవారు
లాభాలతో 2025కి వీడ్కోలు
దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నాలుగు రోజుల నష్టాల తర్వాత బుధవారం లాభాలతో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ, మార్కెట్‌లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ఐటీ రంగం మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు నమోదయ్యాయి. దీంతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.4 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.472 లక్షల కోట్ల నుంచి రూ.476 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ 545.52 పాయింట్లు లాభపడి 85,220.60 వద్ద, నిఫ్టీ 190.75 పాయింట్లు లాభపడి 26,129.60 వద్ద స్థిరపడ్డాయి.

సంబంధిత పోస్ట్