
ఏపీలో జూడాల ఉపకార వేతనం 5 శాతం పెంపు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూడాల ఉపకార వేతనాన్ని 5 శాతం పెంచాలని నిర్ణయించింది. 2026 జనవరి 1 నుంచి ఇంటర్నీలకు 5 శాతం, ఆ తర్వాత ఏటా జూడాల స్టైపెండ్ 3 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు ఏటా 3 శాతం పెంచనున్నారు. 15 శాతం పెంచాలని జూడాలు కోరగా, ప్రభుత్వం 5 శాతం పెంచేందుకు అంగీకరించింది. తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.




