
చిరంజీవి సలహాలు.. నో చెప్పిన దర్శకుడు అనిల్..!
దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్ను ట్రై చేద్దామనే ఆలోచనతో తన వద్దకు వచ్చారని, అయితే ఆ లుక్కు తాను సూటిగా 'నో' చెప్పినట్లు అనిల్ తెలిపారు. చిరంజీవి బయట ఎలా ఉంటారో, సినిమాల్లోనూ అలానే చూపించాలని, ప్రేక్షకులు ఆయన్ని సహజంగా చూడాలని కోరుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కాగా సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.




