స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్‌లకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 చివరి నాటికి (మార్చి 2026 నాటికి) అన్ని ఉత్పత్తులు, సేవలకు ఒకే కేవైసీ (KYC) ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రలైజ్డ్ KYC పోర్టల్ ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఒక్కసారి కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే చాలు, మళ్లీ మళ్లీ ధ్రువీకరణ అవసరం లేకుండా బ్యాంకులోని అన్ని సేవలను సులభంగా పొందవచ్చు.