TG: అనర్హులకు పథకాలు చేరకుండా ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలని చెప్పారు. మంగళవారం కలెక్టర్లు, అధికారులతో సమావేశమై మాట్లాడారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి చేకూరాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదన్నారు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3 లక్షల మంది అనర్హులను తొలగించగలిగామన్నారు.