
తల్లి వర్ధంతి.. 290 మంది రైతుల లోన్లు తీర్చిన వ్యక్తి
గుజరాత్లోని సూరత్ వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా తన తల్లి వర్ధంతి సందర్భంగా అరుదైన దాతృత్వం ప్రదర్శించారు. ఆమ్రేలి జిల్లాలోని జీరా గ్రామానికి చెందిన 290 మంది రైతుల రుణాలను తీర్చాడు. ఓ బ్యాంకులో1995 నుండి కొనసాగుతున్న రైతుల రూ.90 లక్షల లోన్ని జిరావాలా తన సొంత డబ్బుతో చెల్లించి, భూమి పత్రాలను రైతులకు అందించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భూమి పత్రాలు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.




