ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే?

24చూసినవారు
ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే?
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ముగిసిన తర్వాత, జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.