భవానీ మాల ధరించిందని విద్యార్థినిని అనుమతించని స్కూల్ యాజమాన్యం (వీడియో)

10చూసినవారు
AP: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని సికెలే కాన్వెంట్ పాఠశాల యాజమాన్యం తీరు వివాదాస్పదమైంది. భవానీ మాల ధరించిన నాలుగో తరగతి విద్యార్థినిని పాఠశాల నిబంధనలకు విరుద్ధమనే కారణంతో లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భవానీ మాలధారులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ మతపరమైన ఆచారాన్ని పాటించడాన్ని అడ్డుకోవడం సరికాదని, వెంటనే విద్యార్థినిని తరగతికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్