రాష్ట్రంలో బడులు పునఃప్రారంభం: విద్యార్థులకు భారీ మార్పులు!

25చూసినవారు
రాష్ట్రంలో బడులు పునఃప్రారంభం: విద్యార్థులకు భారీ మార్పులు!
TG: జూన్ 15 నుంచి 2026-27 విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది. విద్యార్థుల చేరికలను పెంచేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాదితో పోలిస్తే కనీసం 10 శాతం అడ్మిషన్లు పెంచాలని ఉపాధ్యాయులకు లక్ష్యాలు నిర్దేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక వర్క్‌బుక్స్, ఆగస్టు నాటికి 9 వేల పాఠశాలలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతిరోజూ అల్పాహారం, వారానికి మూడు రోజులు పాలు కూడా అందిస్తారు.

సంబంధిత పోస్ట్