చెట్లు లేకున్నా ఆక్సిజన్.. సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

65చూసినవారు
చెట్లు లేకున్నా ఆక్సిజన్.. సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
చెట్లు లేని ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ అందించేందుకు శాస్త్రవేత్తలు ‘లిక్విడ్ ట్రీస్’ అనే సాంకేతికతను అభివృద్ధి చేశారు. సెర్బియాలోని యూనివర్సిటీ ఆఫ్ బెల్‌గ్రేడ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించిన ఈ ఫోటో బయోరియాక్టర్లు, మైక్రో ఆల్గేతో నిండిన ట్యాంకులుగా పనిచేస్తాయి. డాక్టర్ ఇవాన్ స్పాసోజెవిక్ నేతృత్వంలో రూపొందిన ‘లిక్విడ్ 3’ యూనిట్‌ను బెల్‌గ్రేడ్‌లో ఏర్పాటు చేశారు. ఈ పరికరాలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. సాధారణ చెట్లకంటే వేగంగా గాలిని శుద్ధి చేసే సామర్థ్యం వీటికి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిశోధనా దశలో ఉంది.

సంబంధిత పోస్ట్