లారీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. మహిళ స్పాట్ డెడ్

53923చూసినవారు
లారీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. మహిళ స్పాట్ డెడ్
TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కుక్కలు అడ్డు రావడంతో తప్పించబోయి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ స్కూటీ ఢీకొట్టింది. లారీ కిందకు స్కూటీ దూసుకెళ్లడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సత్తుపల్లి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ రోడ్డుకు చెందిన మోరంపూడి స్వర్ణలత (55)గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్