15 సెకనల్లోనే స్కూటీ చోరీ.. వీడియో

69చూసినవారు
హైదరాబాద్‌లోని బాలాపూర్ ఎక్స్‌ రోడ్‌లో షాప్‌ ముందు పార్క్ చేసిన ఆక్టివా స్కూటీ కేవలం 15-20 సెకన్లలో దొంగిలించబడింది. బాధితుడు మంచినీళ్ల బాటిల్ కొనుగోలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితమే కొనుగోలు చేసిన కొత్త వాహనం దొంగిలించబడటంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగ మద్యం కొనుగోలు చేసిన దృశ్యాలు కూడా పోలీసులకు లభించాయి.

సంబంధిత పోస్ట్