డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ స్కార్పియో కారు (వీడియో)

38చూసినవారు
యూపీలోని కాన్పూర్ దేహాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై వేగంగా వెళ్తున్న ఒక స్కార్పియో కారు బారా టోల్ ప్లాజా దాటిన తర్వాత అదుపు తప్పింది. ఆ కారు డివైడర్‌ను ఢీకొని రోడ్డుపైనే బోల్తా పడింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వెనుక ఎలాంటి వాహనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ ఆవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్