గుంటలో ఇరుక్కుపోయిన మద్యం సీసాల స్కార్పియో.. ఎగబడ్డ జనం (VIDEO)

14780చూసినవారు
బీహార్‌ రాష్ట్రం సివాన్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో నిండిన స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంటలో ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో స్థానికులు సాయం చేయకుండా వాహనం అద్దాలు పగులగొట్టి మద్యం బాటిళ్లు లూటీ చేశారు. మైర్వా ప్రధాన రహదారిలోని జంసిక్రీ గ్రామం సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్