వరద నీటిలో కొట్టుకుపోయిన స్కార్పియో (వీడియో)

41చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో వరద నీటిలో స్కార్పియో కొట్టుకుపోయింది. వంతెనపై భారీగా నీరు ప్రవహిస్తున్నా స్కార్పియోలో ముగ్గురు యువకులు ముందుకు వెళ్లారు. వాగు మధ్యలోకి చేరుకున్న తర్వాత వేగంగా వచ్చిన నీటి ప్రవాహానికి వాహనం కొట్టుకుపోయింది. దాంతో ఆ యువకులు కారులోనే చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. స్కార్పియో వాహనాన్ని కూడా వాగులో నుంచి బయటకు తీశారు. ఈ ఘటన గత నెల 31న జరగగా.. ప్రస్తుతం నెట్టింట వీడియో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్