కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఉండే గీతలు, గుర్తులు కేవలం అలంకరణ కోసం కాదని, దృష్టి లోపం ఉన్నవారు నోటు విలువను సులభంగా గుర్తించేందుకే RBI ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలుస్తోంది. 'ఇంటాగ్లియో' లేదా రైజ్డ్ ప్రింటింగ్ పద్ధతిలో ముద్రించే ఈ గుర్తులు, తాకినప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. రూ.100 నోటుపై గీతలు, రూ.200 నోటుపై గీతలతో పాటు రెండు సున్నాలు, రూ.500 నోటుపై ఏటవాలుగా ఐదు గీతలు ఉంటాయి. ఈ గుర్తులు అంధులకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, భద్రతను అందిస్తూ, నగదు లావాదేవీల్లో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయి.