UN మీటింగ్‌లో రీల్స్ స్క్రోల్‌ చేస్తూ.. సిరియా అధ్యక్షుడు బిజీ బిజీ (వీడియో)

0చూసినవారు
న్యూయార్క్‌లో జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరైన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్‌ షరా రీల్స్ చూస్తూ కెమెరాలకు చిక్కారు. ప్రపంచ నేతలు అంతర్జాతీయ అంశాలపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయన మొబైల్‌లో రీల్స్ స్క్రోల్‌ చేస్తూ కనిపించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రసంగిస్తున్న సమయంలోనూ అల్‌ షరా ఫోన్‌లో లీనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. కాగా, 2025లో ఆయన సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్