ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి, ‘పద్మశ్రీ’ సుదర్శన్ పట్నాయక్ మరో అరుదైన రికార్డును సృష్టించారు. కటక్‌లో జరుగుతున్న బలి యాత్ర–2025 సందర్భంగా ఆయన రూపొందించిన 50 అడుగుల సైకత నావ ‘వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియా’లో స్థానం సంపాదించింది. 30 అడుగుల వెడల్పు గల ఈ నావను 240 టన్నుల ఇసుక, 12,000 జామకాయలు, 500 టెంకాయలు, 1,100 ప్రమిదలతో కేవలం ఆరు గంటల్లో నిర్మించారు. రికార్డ్స్ ప్రతినిధులు సుదర్శన్‌కు ధ్రువపత్రం అందజేసి సత్కరించారు.