తుంగభద్ర నదిలో కొనసాగుతున్న గాలింపు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం

58చూసినవారు
తుంగభద్ర నదిలో కొనసాగుతున్న గాలింపు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం
AP: కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న తుంగభద్ర నదిలో 8 మంది ఈతకు వెళ్లారు. నీటిలో మునిగిపోతున్న ఐదేళ్ల బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు సతీశ్ (35), యువన్ చంద్ర (5), ఎమ్మిగనూరుకు చెందిన వడ్ల ధను (22) ఉన్నారు. మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర (25), ఉరవకొండకు చెందిన సంధ్య (22) కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :