బిహార్‌లో NDA పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. సీట్ల షేరింగ్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU- 101, LJP (R) -29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా బిహార్‌లో రెండు విడతల్లో (నవంబర్ 6, 11) ఎన్నికలు జరగనున్నాయి.