ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. లోక్‌సభ పలుమార్లు వాయిదా పడగా, రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభం కానున్నాయి.