
ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు రోగులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారు 20 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కానీ మృతుల సంఖ్య మంరిత పెరిగే అవకాశం ఉంది.




