హైదరాబాద్‌లోని JBS బస్టాండ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. గ్రామీణ ప్రాంత ఓటర్లకు RTC బస్సులు సకాలంలో ఏర్పాటు చేయడంలో విఫలమైందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ సమయం ఉండటంతో, ఉదయమే JBSకు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు.