బెంగాల్‌లో రెండో విడత పోలింగ్.. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు

45చూసినవారు
బెంగాల్‌లో రెండో విడత పోలింగ్.. పలుచోట్ల స్వల్ప ఘర్షణలు
పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నాడు రెండు విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 142 స్థానాలకు తుది దశ పోలింగ్ జరుగుతుండగా, కొన్ని చోట్ల విధ్వంసకర సంఘటనలు, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంటలీ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందితో బీజేపీ అభ్యర్థి వాగ్వాదానికి దిగారు. నదియా జిల్లాలోని చాప్రలో ఓ బీజేపీ ఏజెంట్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, కొన్ని చోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ జరిగిందని ఫిర్యాదులున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you