ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఓటమిపాలైంది. 126 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ 13.2 ఓవర్లలోనే చేధించింది. మిచెల్ మార్ష్(46)తో రాణించారు. ట్రావిస్ హెడ్(28), జోష్ ఇంగ్లిస్(20) పరుగులు చేశారు. భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి 2, కుల్‌దీప్ యాదవ్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు.