
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ భార్య అన్నా లెజ్నోవా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె తన మహిళా సహచరులతో కలిసి ఆలయానికి చేరుకోగా, అధికారులు స్వాగతం పలికారు. ఆది శంకరాచార్యులు, వల్లభ గణపతికి పూజలు చేసిన అనంతరం భద్రకాళి అమ్మవారికి పూజలు సమర్పించారు. ఆలయ పూజారులు ఆమెను ఆశీర్వదించి, చీరలు, ప్రసాదం అందించారు. ఈ ఆలయ సందర్శన, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.




