మెదక్ బీజేపీలో వర్గపోరు.. రెండు నియోజకవర్గాలు, పది గ్రూపులు

3628చూసినవారు
మెదక్ బీజేపీలో వర్గపోరు.. రెండు నియోజకవర్గాలు, పది గ్రూపులు
TG: మెదక్ జిల్లాలో బీజేపీ అంతర్గత వర్గపోరుతో సతమతమవుతోంది. రెండు నియోజకవర్గాలు, పది గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వాల్దాస్ మల్లేష్ గౌడ్‌ను నియమించినా, ఆయనకు, నర్సాపూర్ నేత మురళి యాదవ్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో నర్సాపూర్‌లో BJP మున్సిపల్ కార్యాలయం పేరుతో మరో కార్యాలయం ప్రారంభమైంది. ఇది పార్టీ కేడర్‌లో గందరగోళాన్ని పెంచుతోంది. ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీకి నష్టం చేస్తున్నారని క్యాడర్ గుర్రుగా ఉంది.

సంబంధిత పోస్ట్