జమ్మూకశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో భద్రతా బలగాలు 'ఆపరేషన్ పింపుల్'ను నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యానికి చెందిన చినార్ కోర్ ఎక్స్ వేదికగా శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.