TG: హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆఫీస్‌కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు లాగి, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ముద్దుపెట్టి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతను ఇందిరానగర్‌లోని సంతోష్ దాబాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.