ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి: మంత్రి తుమ్మల

5చూసినవారు
ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి: మంత్రి తుమ్మల
TG: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉంచామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో జొన్న, మొక్కజొన్న పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయట్లేదని, నష్టం వచ్చినా సరే ఆ పంటను తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. పంటల వైవిధ్యం, పంటమార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల సాగు పెంచాలన్నారు. రసాయనాలు ఎక్కువ వాడితే పంట ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు కనిపిస్తాయని, దీంతో ఇతర దేశాలు కొనట్లేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్