
స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి: సోము వీర్రాజు
AP: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఖాదీ సంతను ప్రారంభించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. 'ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ' నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఖాదీ సంతలో 40 స్వదేశీ వస్తువుల స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఖాదీ, చేతి వృత్తులు, చేనేత, సేంద్రియ ఉత్పత్తులు, ఆయుర్వేదం, మిల్లెట్స్, మొక్కలపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.




