
బెంగాల్‌లో హింసపై సీఈసీ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్, కేంద్ర సాయుధ పోలీసు దళాల (CAPF) డీజీలు క్షేత్రస్థాయిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు సుమారు 700 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తాయని స్పష్టం చేశారు.




