
ఇస్లామాబాద్, వానా దాడుల్లో భారత్ పాత్ర: పాక్ ప్రధాని
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కోర్టు వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని వానా క్యాడెట్ కాలేజీపై దాడి జరిగింది. ఈ రెండు ఘటనల వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. భారత్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులు పాకిస్తాన్‌ను అస్థిరపరచడానికి ప్రాక్సీ దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన పాకిస్తాన్, ఇటీవలి దాడులకూ భారత్‌ను నిందిస్తోంది.




