మహిళలకు స్వయం ఉపాధి.. రూ.25 వేల వరకు సంపాదించే ఛాన్స్

31చూసినవారు
మహిళలకు స్వయం ఉపాధి.. రూ.25 వేల వరకు సంపాదించే ఛాన్స్
TG: స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇతర పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500మంది మహిళలను ఎంపిక చేసి వారికి ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా శిక్షణ ఇప్పిస్తోంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ మహిళా భద్రత విభాగం పర్యవేక్షిస్తోంది. దీని ద్వారా మహిళలు నెలకు సగటున రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు ఆదాయం పొందే వీలుంటుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్