
నారా రోహిత్- శిరీషల హల్దీ వేడుక వీడియో వైరల్
తెలుగు హీరో నారా రోహిత్ పెళ్లి పనులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెళ్లికూతురు శిరీష ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఇటీవల పూర్తయ్యింది. తాజాగా రోహిత్–శిరీష జంటగా హల్దీ ఫంక్షన్ జరుపుకున్నారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుక ఆటలు, పాటలతో సందడిగా సాగింది. అక్టోబర్ 30న ఈ జంట వివాహ బంధంలో అడుగుపెట్టనుంది. తాజాగా హల్దీ వీడియోని రిలీజ్ చేశారు. నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది.




