కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు

25చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచరుడు, BRS సీనియర్ నేత పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మాజీ ZPTC మేడిశెట్టి రాములు హస్తం గూటికి చేరారు. రాములు వెంట పర్వతగిరి(M) బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వర్ధన్నపేట MLA కెఆర్ నాగరాజు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్