కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి, ఆయన బంధువులు శంకర్, ఎర్రన్నలు మృతి చెందారు. కలబురగి సమీపంలో గౌనహల్లి వద్ద కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి మృతిపై సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.