త్వరలో ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు

8874చూసినవారు
త్వరలో ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు
హైవే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త వ్యవస్థను అమలు చేయనుంది. వాహనం ప్రయాణిస్తుండగానే టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా డిడక్ట్ అయ్యే విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థలో ANPR కెమెరాలు, FASTag టెక్నాలజీని కలిపి ఉపయోగించనున్నారు. నంబర్ ప్లేట్లు స్కాన్ అయి ఫాస్టాగ్ ఖాతా ద్వారా టోల్ మొత్తం స్వయంచాలకంగా కట్ అవుతుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్, క్యూల సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్