కేంద్ర ప్రభుత్వం రైల్వేలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 30 వేల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2 వేల పోస్టులు కోల్పోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏటా 2 శాతం చొప్పున ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం రైల్వే ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.