యువతిని 10 ముక్కలు నరికిన కేసులో సంచలన విషయాలు

16618చూసినవారు
యువతిని 10 ముక్కలు నరికిన కేసులో సంచలన విషయాలు
AP: ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవానిపురానికి చెందిన షఫి అనే వ్యక్తి, మృతురాలు కళ్యాణితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. కళ్యాణి తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల 17న రూ. 20వేలు డిమాండ్ చేయడంతో, షఫి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం, మటన్ షాపులో పనిచేసే స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికి, బ్యాగుల్లో నింపి గొల్లపూడి దగ్గర కూలింగ్ కెనాల్లో పడేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్