నకిలీ మద్యం కేసులో జనార్దన్ సంచలన వీడియో

29302చూసినవారు
AP: నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్‌రావు సంచలన విషయాలు బయటపెట్టాడు. నకిలీ మద్యం తయారీలో మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని, పై అధికారుల ఆదేశాలతోనే ఈ పని అప్పగిస్తున్నానని జోగి రమేష్ చెప్పారని జనార్దన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జోగి రమేష్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారని జనార్దన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్