సెన్సెక్స్‌ 1180 పాయింట్ల పతనం.. ₹8 లక్షల కోట్లు ఆవిరి

28చూసినవారు
సెన్సెక్స్‌ 1180 పాయింట్ల పతనం.. ₹8 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1124 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 23 వేల మార్కు దిగువన స్థిరపడింది. హర్మూజ్‌ను తెరిచే శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తిరస్కరించినట్లు వార్తలు రావడంతో చమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు, బాండ్ల రాబడులు పెరగడం వంటివి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.8 లక్షల కోట్లు ఆవిరై రూ.474 లక్షల కోట్లకు చేరింది.

సంబంధిత పోస్ట్