
రెవెన్యూ సేవలు సులభతరం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలతో సహా అన్నింటా రియల్ టైమ్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, ఏడాదిలోగా రెవెన్యూ శాఖలో పూర్తి ప్రక్షాళన జరగాలని, దీనిపై ప్రతినెలా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.




