బ్రెజిల్లో వరుస హత్యలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న 33 ఏళ్ల జొర్లాన్ లోప్స్ డ సిల్వా అనే సీరియల్ కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈశాన్య బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో 16 మందిని హత్య చేసినట్లు ఆధారాలున్నాయి. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అమ్మాయిలా వేషం మార్చి, మహిళల దుస్తులు, విగ్గు, నెయిల్‌పాలిష్ ధరించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికులు అతడిని 'మస్కిటో' అని పిలుస్తారని తెలిపారు.