అఫ్గానిస్థాన్‌తో జరగనున్న
టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అభిషేక్, వైభవ్, శాంసన్, ఇషాన్, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే, ఐటీ స్టార్ గుర్తుతో ఉన్న ఆటగాళ్లకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉందని బీసీసీఐ తెలిపింది. ఈ మూడు
టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగనున్నాయి.