
స్పీకర్ పక్షపాతంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం
పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేతకు తగినంత సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సంఖ్యాబలం లేకపోయినా, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.




