
బీహార్లో సుపరిపాలన, సంక్షేమం గెలిచింది: ప్రధాని మోదీ
బీహార్లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ, సామాజిక న్యాయం గెలిచిందని, NDA విజయం అపూర్వం, చరిత్రాత్మకమని తెలిపారు. బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ తీర్పు నూతనోత్తేజంతో పనిచేసేందుకు శక్తినిచ్చిందని అన్నారు. అవిశ్రాంతంగా పనిచేసిన NDA కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రతిపక్షాల అసత్యాలను వారు తిప్పికొట్టారని చెప్పారు. బీహార్ అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపునకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.




