శీతాకాలంలో నువ్వుల నూనె చర్మాన్ని రక్షించి, వెచ్చగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని పోషించి, యవ్వనాన్ని కాపాడుతుంది. కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుందని ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. శీతాకాలంలో పెరిగే వాతాన్ని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలకు నువ్వుల నూనె మసాజ్ తో ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే సెసామోల్, సలామైన్, విటమిన్ E చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి.