కవిత పార్టీ పెట్టడం ఒక బిగ్ జోక్: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

27చూసినవారు
మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టడం ఒక పెద్ద జోక్ అని, ఆమె తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులున్నాయని పార్టీ పెట్టడం పాన్ షాప్ నడిపినంత సులువు కాదని, సొంతంగా పోటీ చేసినా డిపాజిట్ రాదని ఆయన అన్నారు. మద్యం కుంభకోణంలో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, ఆమె నిర్దోషి అని తేలలేదని ఆయన పేర్కొన్నారు. ఒక ఉద్యమకారుడి బిడ్డగా కవిత తన తండ్రికి విలువ ఇవ్వడం లేదని, అన్నపై కోపం తండ్రిపై తీర్చుకోవడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్